UPDATES  

 నేడు నస్పూర్ లో జరగనున్న కాంగ్రెస్ సత్యాగ్రహ సభను జయప్రదం చేయండి కాంగ్రెస్ జిల్లా నాయకులు కిషన్ నాయక్, విజయలక్ష్మి

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్…దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నిరంతర పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర అంబేద్కర్ జయంతి నాడు మంచిర్యాలకు చేరుకున్న నేపథ్యంలో నస్పూర్ లోని కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ సభను భారీఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక అయితా కాంప్లెక్స్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయలక్ష్మి, కిషన్ నాయక్ లు మాట్లాడుతూ…తాము 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని, ప్రజలకు సేవ చేయాలనే జిజ్ఞాసతో కేటీపీఎస్ లో ఇంజనీర్ గా ఉన్నత ఉద్యోగంలో ఉన్న నేను ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించానని కిషన్ నాయక్ పేర్కొన్నారు. డీసీసీ కార్యదర్శిగా కూడా పనిచేశానని తెలియజేసారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో తనను దీవించి గెలిపించాలని కోరారు. గిరిజన లంబాడా తెగకు చెందిన మేము , మా కుటుంబసభ్యులంతా కాంగ్రెస్ పార్టీలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నామని అనేక సేవాకార్యక్రమాలు సైతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర చేరుకున్న సందర్భంగా నస్పూర్ లో భారీ సత్యాగ్రహ సభకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ సభకు ఇల్లందు నుండి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాన్షీరాం, బానోత్ లాల్సింగ్, గుగులోత్ బాబురావు, బిందుపల్లవి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !