మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్13 మణుగూరు మండలం లోని రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు రూ.4 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుఅధికారులతోకలిసిపరిశీలించారు.జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,అధికారులను విప్ రేగా ఆదేశించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ లో సుమారు రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ,డ్రైనేజ్ క్లీనింగ్ పనులను విప్ రేగా కాంతరావు పరిశీలించారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,ఏఈలు సత్య, నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు సీనియర్ నాయకులు నరసింహారావు, యాదగిరి గౌడ్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.