మన్యం న్యూస్, పినపాక : ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు జరిగే ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గోడ పత్రికల ఏడూళ్ళ బయ్యారం అడ్డరోడ్డులో ఆవిష్కరణ జరిగింది. బిజెపి కో హటావో- దేశ్ కో బచావో పేరుతో ప్రజా పోరు యాత్ర చేస్తున్నామని సిపిఐ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పద్మనాభ రాజు, మనోహరాచారి, పత్తిపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.