UPDATES  

 అంబేద్కర్ జయంతిరోజు అసమ్మతి మున్సిపల్ కౌన్సిలర్లకు అవమానం

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు పురపాలక కార్యాలయంలో పట్టణంలోని అసమ్మతి కౌన్సిలర్లు శుక్రవారం శుక్రవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయమై అసమ్మతి కౌన్సిలర్లు మాట్లాడుతూ…బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ ఆఫీసులో ఉదయం పదకొండు గంటలకు అందరు కౌన్సిలర్లు హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ అంకుషావలి ఫోన్ ద్వారా కౌన్సిలర్లను పిలిచారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొనేందుకు అంగీకారం తెలిపామని పేర్కొన్నారు. కానీ మేము రాకముందే పదకొండు గంటలు అని చెప్పిన టైము మార్చి ఉదయం తొమ్మిది గంటలకు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అంబేద్కర్ జయంతి వేడుకలు ముగించి వెళ్లడం జరిగిందని తెలిపారు.ఈ నేపథ్యంలో కొంతమంది కౌన్సిలర్లు రాలేదని, అయిన కానీ మిగిలిన అసమ్మతి మున్సిపల్ కౌన్సిలర్స్ మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి ప్రోటోకాల్ ప్రకారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినట్లు వారు పేర్కొన్నారు. పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్లమైన మమ్మల్ని ఇంకా ఇప్పటికీ ఎందుకు చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మద్దతుతో బాధ్యతాయుత పదవిలో ఉన్న ఛైర్మెన్ డీవీ కూడా ఈ విధమైన ధోరణిని ఇంకా కొనసాగించటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఇటువంటి వివక్ష, నిర్లక్ష్యపు వైఖరిని విడనాడాలని లేనిపక్షంలో మరోమారు అసమ్మతి సెగకు బలికావల్సి వస్తుందని హెచ్చరించారు. కౌన్సిలర్లు అంటే వారికి లెక్కలో ఉన్నారా లేరా అనేది ఇల్లందు ప్రజలు మరియు మీడియా సోదరులు గమనించవలసిందిగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిదులు లేకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారని, ప్రోటోకాల్ పాటించడామంటే ఇదేనా అంటూ వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 19 వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, ఆరవ వార్డు కౌన్సిలర్ తోట లలిత శారద, 24వ వార్డు కౌన్సిలర్ తార, 18వ వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి, 14వ వార్డు కౌన్సిలర్ సంద బిందు తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !