మన్యంన్యూస్,ఇల్లందు టౌన్:పట్టణంలోని జేకేలో ఉన్న హరిహరక్షేత్రంలో అయ్యప్పస్వామి జన్మదినాన్ని ఆలయకమిటీ సభ్యులు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ లు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హరిహరక్షేత్రం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో అయ్యప్పస్వామి పుట్టినరోజు సందర్భంగా జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హరిహరక్షేత్రం ఆలయ కమిటీ చైర్మన్ ఎల్. కృష్ణ మరియు పాలకమండలి సభ్యులు పర్రె స్వర్ణలత, కే. సంధ్య, రెబ్బ చంద్రశేఖర్, డికొండ నాగరాజు, దుంపటి కృష్ణ, పులిగళ్ళ గంగాధరరావు, ఆలయ సిబ్బంది పెద్దినేని రామకృష్ణ పాల్గొన్నారు.
