మన్యం న్యూస్ ఏటూరు నాగారం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సాహాలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా ములుగు జిల్లా మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఇన్చార్జి వావిలాల స్వామి నిర్వహించారు.ముఖ్య అతిథులుగా డాక్టర్ వరప్రసాదరావు,జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు వలియాబి,స్థానిక సర్పంచ్ రామ్మూర్తి,టి డబ్ల్యూ టి యు రాష్ట్ర అధ్యక్షులు పోదెం కృష్ణ ప్రసాద్,సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎండి దావుద్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి, స్థానిక సీఐ మండల రాజు హాజరై మాట్లాడుతూ. అంబేద్కర్ ఈ దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడని ఈ దేశానికి మొదట న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వారని,భారత రాజ్యాంగం ద్వారా మానసిక స్వతంత్రాన్ని ఈ సమాజంలో ప్రకటించుకునేందుకు గొప్ప భావాజాల వ్యాప్తిని భారత రాజ్యాంగం ద్వారా కల్పించారని అంబేద్కర్ ను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు,
పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్,ఉపాధ్యాయ నాయకులు కొయ్యడ మల్లయ్య,మాజీ సర్పంచ్ లాలయ్య,మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు,
ఎమ్మార్పీఎస్,తుడుం దెబ్బ సంఘాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
