మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాన సెంటర్లో దళిత సంఘాల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీపీ మాట్లాడుతూ…. భావి భారతదేశం కోసం ముందుగా తన ఆలోచనలు రాజ్యాంగం రూపంలో వ్రాశాడన్నారు. ఆయన ఆలోచనలు నేటికి ఆచరణనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారయాణ, ఎంపిటీసీ దారా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, నాయకులు అంకిరెడ్డి క్రిష్ణారెడ్డి, మాలోత్ బోజ్యనాయక్, , ఉప్పతల ఏడుకొండలు, మేడా
మోహన్ రావు, సారేపల్లి శేఖర్, ప్రధానోపాధ్యాయుడు ఉండేటి ఆనంద్ కుమార్, ఇస్లావత్ వీరన్న, బాబా, ఐలూరి రామిరెడ్డి, సూరా వెంకటేశ్వర్లు, చాపలమడుగు ప్రసాద్, చాపల మడుగు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, కుక్కమూడి దినేష్ కుమార్, సేవియా,తదితరులు పాల్గొన్నారు.