మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 14: అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన చండ్రుగొండలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అయ్యప్ప భక్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.వేదపండితులు వివిఆర్ కె మూర్తి ఆద్వర్యంలో అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 18 మెట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపాలు భక్తులను అమిత్తంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్త కమిటీ ఆద్వర్యలో గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.