UPDATES  

 సమానత్వానికి స్ఫూర్తిదాత అంబేద్కర్.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
సమానత్వానికి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల మహానీయుడు అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు అన్నారు మండల కేంద్రంలోని మొలకపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 132వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్బులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి నవభారత నిర్మాత అణగారిన ప్రజల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడని అన్నారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సీతారామారావు డివిజన్ యూత్ సెక్రెటరీ లంక శివకుమార్ సీనియర్ నాయకులు దర్శి సాంబశివరావు జిలకర వెంకటేశ్వర్లు ఎస్సి సెల్ల్ అధ్యక్షులు శ్రీను యూత్ అధ్యక్షులు కోడి చంటి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !