మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 14: మండల పరిధిలోని అయ్యన్నపాలెం గ్రామం లో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోగి కృష్ణ మాట్లాడుతూ… సమాజంలోని ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని, కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఐక్యమత్యంతో మెలగాలని అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో లేదా ఒక మతానికో పరిమితం చేయకుండా భారతీయులందరూ కూడా దైవంలాగా పూజించే మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గుగులోత్ జ్యోతి నాయక్, మండల ప్రధాన కార్యదర్శలు గుగులోతు నీలవర్ణ, గుగులొత్ రాంబాబు , ఉపాధ్యక్షుడు గుగులోత్ రాజేష్ నాయక్, బి జె వై ఎమ్ మండల అధ్యక్షుడు భూక్య రాంపండు, బూతు అధ్యక్షులు బోడా చంద్రశేఖర్, గుగులోతు వినోద్, తదితరులు పాల్గొన్నారు.