మన్య న్యూస్ గుండాల…భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్పీ నాయకులు రాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత 132వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉన్నట్లు ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, సంజీవ్, సంపత్, అనిల్ కుమార్, తుడుం దెబ్బ నాయకులు కోడెం వెంకటేశ్వర్లు, శ్రీను, రాఘవైన చంద్రయ్య దొర, ప్రజాపంధ నాయకులు శంకర్, శాంతయ్య, తదితరులు పాల్గొన్నారు
