మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జిల్లా గ్రంథాల సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచం గర్వించ దగ్గ మేధావి అంబేత్కర్ అని అన్నారు. అందుకే దేశం గర్వించే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. రాజ్యాంగ ఫలాలు నేడు అందరికీ అందాలననే సదుద్దేశంతో ప్రభుత్వం అన్ని వర్గాలను ఒకే తాటిపై కి తెచ్చి అభివృద్ధి ఫలాలు అందిస్తుందని తెలిపారు. అలాంటి మహానుభావుడు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. అంబేద్కర్గారి జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాండ్లు డీ వరలక్ష్మి దేవి, జి మణిమృదుల, రిటైర్డ్ టీచర్ దస్తగిరి, జయరామ్ ,నిఖిల్ పాఠకులో విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు