మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు, స్థానిక జెకె కాలనీలో అంబేద్కర్ జయంతి ఘనంగా జరిపారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ నాయకులు మాట్లాడుతూ…భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉంది అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని సమ సమాజ స్వాప్నికుడు అని అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుని ఆయనను కొనియాడారు. భారతరత్న డా.బి.అర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదం అంటూ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పర్రె శ్రీనివాస్, ఎస్కే పాషా, అధికార ప్రతినిధి కుంట నవాబు, ఆర్గనైజర్ సెక్రెటరీ సనా రాజేష్, సూర్యనారాయణ, గొప్పగాని రాజ్, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సత్తాల హరి కృష్ణ, ఇల్లందు పట్టణ నాయకులు రవితేజ, యువజన నాయకులు, పాలడుగు రాజశేఖర్, చాంద్ పాషా, నెమలి నిఖిల్, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గండ్రాతి చంద్రావతి, నారాయణమ్మ, మదర్బి, ఇల్లందు మండల ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, హమాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.