పొంగులేటి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ తీవ్రంగా ఖండిస్తున్నాం…
– నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా.
– పినపాక మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు.
మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 14: పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక హనుమాన్ ఫంక్షన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికల్లో ఎన్నో రకాలుగా పొంగేటి శ్రీనివాసరెడ్డిని వాడుకొని ఇప్పుడు సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. రాజకీయ రంగంలో ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, పొమ్మనలేక పొగ పెట్టారన్నారు. పొంగులేటి సస్పెండ్ కు నిరసనగా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామన్నారు. మేమంతా పొంగులేటికి మద్దతుగా ఉన్నామని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెళ్తామన్నారు. ఆయన ఏ పార్టీకి వెళ్లాలో మే నెలలో నిర్ణయం తీసుకుంటారన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కొంతమంది ప్రజాప్రతినిధులు మాకు ఫోన్లో టచ్ లో ఉన్నారన్నారు. త్వరలోనే వారు కూడా రాజీనామాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, ఉప సర్పంచులు, పుచ్చకాయల శంకర్, గోరంట్ల కనకయ్య, వీరంకి వెంకట్రావు గౌడ్, తరుణ్ రెడ్డి,
నాయకులు సుబ్బారెడ్డి,నిట్ట జీవరత్నం, పల్లపు తిరుమలేష్, మాదాడి రాజేష్, బల్లెం సురేష్, కటుకూరి శ్రీనివాసరావు, పాతురి వెంకన్న, దొడ్డపనేని మదుకుమార్, తమ్మిశెట్టి సాంబ,రామకృష్ణ, ఆచంట సాయి, మైబుబ్ పాష, గుడికందుల రాజేంద్రప్రసాద్, పాల్వంచ సుజాత, కొలపిన్ని మానస, అనిత, మంగ, ప్రభావతి, పద్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు