మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని బిటిపిఎస్ లో సిఈ బిచ్చన్న ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి సిఈ బి.బిచ్చన్న పూలమాలలు వేసి నమస్కరించారు.సిబ్బంది కూడా పూలు సమర్పించి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీ ఈ బిచ్చన్న మాట్లాడుతూ, మన దేశ తలరాతను మార్చినటువంటి మహోన్నత వ్యక్తికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయుని 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ రాష్ట్రానీకే కాకుండా దేశానికే గర్వకారణం అని ఆయన అన్నారు.అనంతరం మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ నివాసి మర్రి సురేష్ హార్ట్ ప్రాబ్లం రావడంతో ఖమ్మం మమతా హాస్పిటల్ నందు హార్ట్ లో స్టంట్ వేయడం జరిగింది.కానీ అది ఫెయిల్ అవ్వడం తో విజయవాడ వై వి రావు హాస్పటల్ కు వెళ్ళగా అక్కడ వారు హార్ట్ ఓపెన్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీకి వారి వద్ద డబ్బులు లేక ఎవరైనా తమకు తోచినంత సహాయం చేస్తే తను విజయవాడ హాస్పిటల్ లో ఆపరేషన్ చేపిస్తాము అని భార్య,పిల్లలు తెలపడం తో స్పందించిన బిటిపిఎస్ భూ నిర్వాసిత ఉద్యోగ సేవ సమితి ఆధ్వర్యంలో సీఈ బిచ్చన్న చేతుల మీదుగా రూ.10 వేల రూపాయల నగదును వారికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ సిఎడిఎం బి.పార్వతి,ఎస్ ఈ లు టి. శ్రీనివాసరావు,రమేష్ బాబు, ఎస్.వెంకటేశ్వర్లు,రాంప్రసాద్,బి.శ్రీనివాసరావు, డి ఈ సెప్టీ జి. ఆనంద్ ప్రసాద్,ఇంజనీర్స్ సంఘాలు,కార్మిక సంఘాలు తదితరులు పాల్గొన్నారు.