UPDATES  

 స్ఫూర్తి ప్రదాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

 

మన్యం న్యూస్ వాజేడు

ములుగు జిల్లా వాజేడు మండలంలో పలు గ్రామాలలో రాజ్యాంగ రచయిత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వాజేడు గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథులుగా ఎస్సై అశోక్ పాల్గొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యార్థి దశ నుండి ఎన్నో అవమానాలు ఎదురైన,అస్పృశ్యత తో ఊరికి దూరంగా ఉంచిన తన పట్టుదలతో, స్వయం కృషితో 33 డిగ్రీలు సాధించారు. దేశంలో కుల నిర్మూలన కొరకు ఉద్యమాన్ని చేపట్టారు. దశలవారీగా పోరాట స్ఫూర్తితో సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఈరోజు దేశంలో ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపు సాధించిన వ్యక్తి, భారత దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మండలంలో మొట్లగూడెం గ్రామంలో అంబేద్కర్ ఉత్సవాలకు ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొర్శ, నరసింహమూర్తి హాజరై మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం రాయవలసి వచ్చినప్పుడు స్లోకాళ్ల ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా రాజ్యాంగాన్ని రచించవలసిందిగా అంబేద్కర్కి అవకాశం ఇచ్చారంటే ప్రధానంగా దానికి కారణం చదువు, చదువు కొరకు బరోడా సంస్థానం స్కాలర్షిప్ ద్వారా కేమ్ బ్రిడ్జి యూనివర్సిటీలో తీసేసి రాసి డిగ్రీ పట్టా పొందిన ఏకైక వ్యక్తి అంబేద్కర్, అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం వెనుకబడిన వర్గాల వారు ఏ రిజర్వేషన్ ద్వారా ఆర్థిక ,రాజకీయ, విద్యా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారో,ఆ సమాజానికి మీయొక్క జ్ఞానాన్ని, మీరు రిజర్వేషన్ ద్వారా ఏదైతే సాధించారో తిరిగి మళ్ళీ అదే సమాజానికి మీరు జ్ఞానాన్ని అందించినట్లయితే మిగతా సమాజం ఆ యొక్క రిజర్వేషన్లు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, అందుకే పది సంవత్సరాల రిజర్వేషన్ కోరారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, ఏఎస్ఐ, బి ఆర్ యస్, పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు, వేణు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీతారామరాజు, అంబేద్కర్ యువజన నాయకులు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !