- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తి కావాలి
- సింగరేణి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు
- -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏరియా జిఎం దుర్గం రామచందర్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 14
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి దార్శనికులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తి కావాలని మణుగూరు ఏరియా ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు. మణుగూరు ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో పివి కాలనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు ఏరియా జిఎం దుర్గం రామచందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా తొలుత ముఖ్య అతిథితో పాటు విశిష్ట అతిధులు,ఆహ్వానితులు,ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు,ఏరియా కార్మిక సంఘాల నాయకుల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి,పూలమాలలు వేసి, పువ్వులతో పుష్పభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్ నినాదంతో సభా ప్రాంగణం మార్మోగింది. అనంతరం జరిగిన సభకు ఏరియా అధికార ప్రతినిధి డిజిఎం పర్సనల్ ఎస్.రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా జిఎం ప్రసంగించారు.నాటి ఉభయ ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి సమీపంలోని ఒక గ్రామంలో తాను జన్మించానని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తన గ్రామంలో మైనింగ్ ఇంజనీరింగ్ పట్టా పొందిన తొలి విద్యార్థినని అని తెలిపారు.అంబేద్కర్ స్ఫూర్తితో తన ఎదుగుదలను గమనించిన అనేక మంది యువకులు ఆ తర్వాత ఉన్నత చదువులు చదివారని జిఎం స్థాయికి ఎదగటానికి సింగరేణి తల్లి ఒడిలో తాను సంతోషంగా జీవించడానికి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి అని హర్షద్వానాల మధ్య ఉద్వేగంతో ప్రకటించారు. సామాజిక సమానతలు తొలగించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఎస్సీ ఎస్టీలు వెనుక బడిన వర్గాలు ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం చదువని, చదువుతో ఏదైనా సాధించవచ్చు అని అంబేద్కర్ నిరూపించారని అన్నారు. అందుకే ఆయన ప్రపంచ మేధావిగా కీర్తింపబడటమే కాకుండా భారతరత్నగా ఆయన అందరివాడు అయ్యాడని ఆయన ప్రశంసించారు.సింగరేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతోపాటు,అన్ని ఏరియాలకు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించుటకు లక్ష రూపాయలు బడ్జెట్ కేటాయించటం,అన్ని విధాలుగా సేవలందిస్తున్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించడం కూడా జరుగుతోందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నడి బొడ్డున తెలంగాణ ప్రజలు తలెత్తుకుని చూసుకునేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నేడు ఆవిష్కరించటం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.రాజ్యాంగ స్ఫూర్తితో సింగరేణి సంస్థను కాపాడుకోవాలని,రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరు పాటుపడాలని సింగరేణి తల్లి ముందు అందరూ సమానమేనని ఆయన అన్నారు.సింగరేణి ఎస్సీ ఎంప్లాయిస్ లైజన్ ఆఫీసర్ గా తనకు బాధ్యతలు అప్పగించిన సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేకించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో శాలువా పూల మాలలతో జిఎం దుర్గం రామచందర్ ను ఘనంగా సత్కరించారు. సింగరేణి ఉద్యోగులుగా పలు రంగాలలో గుర్తింపు పొందిన ఉద్యోగులను,ఇతర ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను,కార్యక్రమంలో భాగంగా సాలువ,పూల మాలలు బహుమతులతో ఘనంగా సత్కరించారు.వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ పుష్పాంజలి ఘటిస్తున్న ఇరువురు కాంట్రాక్ట్ కార్మికులను,బహుమతులతో ఘనంగా సత్కరించారు.ఓసి 2 పవర్ సెక్షన్ లో పనిచేస్తున్న నోముల నాగరాజు అశ్విని దంపతుల కుమారుడు ఆరేళ్ల చిన్నారి జితేంద్ర అంబేద్కర్ పై పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.జిఎం పాటు గుర్తింపు సంఘం నాయకులు ప్రభాకర్ రావు,అతిథులు చిన్నారిని తల్లిదండ్రులను అభినందించారు.సింగరేణి కళాకారులు డేవిడ్ రాజు బృందం ఆలపించిన అంబేద్కర్ గీతాలు ఎంతగానో అలరించాయి.సహపంక్తి భోజనాల కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఏరియా గుర్తింపు సంఘం నాయకులు వి ప్రభాకర్ రావు తో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు,ఇతర సంఘాల నాయకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏరియా సివిల్ విభాగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ యస్ ఓ టు జిఎం వేంకట రమణ, ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ నర్సి రెడ్డి, డిజీయం పర్సనల్ యస్ రమేష్,టీబీజీకేఎస్ నాయకులు వి.ప్రభాకర్ రావు,ఎంపీటీసీల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎం. రాముడు,ప్రెసిడెంట్ ఎస్టీ అసోసియేషన్,డిప్యూటీ మేనేజర్,ఎస్ స్సి లైజెన్ ఆఫీసర్ ఎం నరసింహారావు, ఎస్టీ లైసెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్,ఎస్సీ అసోసియేషన్ సెంట్రల్ విపి కాజీపేట కృష్ణ, మేకల ఈశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ ఎస్టీ అసోసియేషన్ భుక్య కిషన్,సీనియర్ పర్సనల్ అధికారులు అవినాష్,సింగు శ్రీనివాస్,రామేశ్వర రావు, భూక్య రాములు,ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అజ్మీరా దేవి, నర్సింగ్ సూపర్డెంట్,వీ జాన్, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, సిఐటియు యూనియన్ నాయకులు వేంకట రత్నం, యూనియన్ నాయకులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.