UPDATES  

 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వ్యక్తి కాదు శక్తి* ఏఎస్పి సంకీర్త్

 

మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఏ ఎస్పీ సంకీర్త్, మంగపేట ఎస్ఎచ్ఓ తాహెర్ బాబా,
పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఏఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు దేశ వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషం, ఈ పుట్టినరోజు వేడుకలలో నన్ను అతిధి గా పిలవడం నా అదృష్టం అంటూ…..బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, సమసమాజనవ నిర్మాణ దార్శనికుడు,సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్…దేశంలో అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశాడు, అన్ని వర్గాలకు సమానమైన స్వే చ్ఛ, స్వాతంత్ర్యం సమానంగా ఉండేలా హక్కులు కల్పించారని నొక్కి వక్కా నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికో చెందిన వాడు కాదు, మన అందరివాడు, సబ్బండ వర్గాలకు మేలు చేసినవాడు. భారతదేశం యొక్క భవిష్యత్, కోసం దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు, దేశం కోసం తన కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యం చేసి అహర్నిశలు భారతీయుల కోసం స్వప్నించి సాకారం చేసుకున్న వ్యక్తి, వ్యక్తి కాదు ముఖ్యం,వ్యవస్థ ముఖ్యం అని భావించిన వ్యక్తి అని ఏటూరునాగారం ఏఎస్పి సంకీర్త్ అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్బంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏఎస్పి సంకీర్త్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్బంగా పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఏఎస్పీతో పాటు మండలంలోని నాయకులు అంబేద్కర్ వాదులు పాల్గొని అంబేద్కర్ భారత రాజ్యంగా నిర్మాత గురించి కొనియా డారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తోట రమేష్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, జాతీయ మిర్చి డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు,శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్,బిజెపి పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ,కాంగ్రెస్ నాయకులు చందర్లపాటి శ్రీనివాస్, లోడే శ్రీనివాస్ యూటీఎఫ్టీఎస్ యూటీఎఫ్ నాయకులు గొప్ప సమ్మారావు, చెంచ్చయ్య, చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు, కోడం బాలకృష్ణ, ఎంపెల్లి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !