మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్ 14: మండల పరిదిలోని కొమ్ముగూడెంలో వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం స్వగృహం నందు మండల కన్వీనర్ నెట్టా రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోయం వీరభద్రం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలి అర్పించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో, ఒక కులానికో చెందినా వాడు కాదని అందరివాడని, సమాజంలో దళిత, బడుగు, బలహీన వర్గాల అంటరానితనం, అస్పృశ్యత, కుల వ్యవస్థ, నిర్మూలించటానికి తన రక్తపు బొట్టు చివరి వరకు పోరాటం చేసిన త్యాగధనుడని, అన్నీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం భారత రాజ్యాంగం లో పొందుపరిచిన రాజ్యాంగం తత్వవేత్త అని, నేడు సమాజంలో యువతి, యువకులు అంబేద్కర్ ఆశయాల, సాధన కోసం నిరంతరము కృషి చెయ్యాలిసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో దమ్మపేట మండలం కన్వీనర్ నెట్టా రామకృష్ణ, తనికెళ్ళ యేసుపాదం, ఎలికే నరసింహారావు, బీరవెల్లిప్రసాద్, సోయం సత్యనారాయణ, వాడే నరసింహారావు, వాడే శివాజీ, చేపా జోగారావు గ్రామస్థులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.