మన్యం న్యూస్,ఇల్లందు టౌన్…:భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ ఆద్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం విఠల్ రావు భవన్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ దలిత హక్కుల పొరాట సమితి రాష్ట్రసబ్యులు జంగంపల్లి మోజెస్, టిజెఎస్ రాష్ట్ర సమితి సభ్యులు గుగులొత్ కృష్ణ, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నజీర్ అహ్మద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేళ యావత్ భారతజాతి గర్వపడే విధంగా పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం, పీడిత ప్రజల బాగు కోసం,బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోయువత నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీనవర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి పేర్కొన్నారు. భారతదేశంలో 90శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి శంషుద్దిన్, వళి, చెరుకు సారయ్య, బజారు ఆంజనేయులు,సామల శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి ఈర్ల రవికుమార్ ,ఆఫీస్ ఇంచార్జి వడ్లకొండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
