- మహిళల పక్షపాతి అంబేద్కర్
- ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
దేశంలో సగ భాగమైన మహిళలకు విద్య,ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహిళల పక్షపాతి అంబేద్కర్ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యెర్రా కామేష్ కొనియాడారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం ఎదుట అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ చట్ట సభల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని హిందు కోడ్ బిల్లుపెడితఅప్పటికాంగ్రెస్పార్టీవ్యతిరేకించిందని. అందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికే రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని,భారత దేశానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పదేనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రచించారని యువత అయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,పట్టణ కార్యదర్శి కేతిని కుమారి,మర్థమ్మ,ఎర్రంశెట్టి రాజేశ్వరి,సరోజ* తదితరులు పాల్గొన్నారు.