UPDATES  

 నిషేదిత మావోయిస్టు పార్టీ దళ సభ్యుని (మైనర్) లొంగుబాటు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం
తూర్పుగోదావరి డివిజన్ దళ సభ్యుడు (మైనర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోవడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సంబంధిత వివరాలను వెల్లడించారు
లొంపోయిన దళసభ్యుని వివరాలు: –
, చర్ల మండలం. చెన్నపురం గ్రామానికి చెందిన సోడి రాము వయసు 17 సంవత్సరాలు ఇతడు 2020 నుంచి 2022 వరకు నిషేధిత మావోయిస్టు పార్టీకి మిలీషియా సభ్యునిగా పనిచేసి
సంవత్సర కాలం నుంచి డివిజన్ సెక్రెటరీ ఆజాద్ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా పోలీసులు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో దళ సభ్యులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను పిలిచి చర్ల పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇట్టి కౌన్సిలింగ్ వలన ప్రభావితుడై సోడి రామ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ అధికారులు ఎదుట లొంగిపోవడంజరిగిందన్నారు.
సరిహద్దు ఏజెన్సీ గ్రామాల్లో చదువుకునే మైనర్లను ఇంటికి ఒకరిని మావోయిస్టు పార్టీలో
చేర్చాలని ఆదివాసీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని. మావోయిస్టు పార్టీలో మైనర్ బాల బాలికలనుబలవంతంగా చేర్చుకుని వారి చేత బట్టలు ఉతికించడం, సామాన్లను మోయించడం, వంట పనులుచేయించడం,గార్డ్ డ్యూటీలు చేయించడం వంటి అకృత్యాలకు పాల్పడుతూ బాలల హక్కులను
కాలరాస్తున్నారు.మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులను భరించలేక చాలామంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇటీవల జిల్లా పోలీసులు ఏర్పాటుచేసిన “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమంలో హాజరయిన కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీలో దళ సభ్యులుగా పనిచేస్తున్న వారి
కుటుంబ సభ్యులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే సోడి రామ లొంగిపోవడం జరిగిందని
గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం
కోల్పోయి చత్తీస్గడ్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందన్నారు.. కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా కమిటీలనుఏర్పాటు చేసి బలవంతపు వసూల్లే లక్ష్యంగా పనిచేస్తూ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధినిఅడ్డుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదనిఅమాయకపుఆదివాసీలనుభయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ,స్వయంగా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గానీ
సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి,పునరావాసం కల్పించడంకోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !