మన్యం న్యూస్ చర్ల :
చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశాలమేరకు ఈనెల 24 న జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు సోయం రాజారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్, రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇలాంటి మరెన్నో పథకాలను అందిస్తున్నారు.కావున పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, ఉపాధ్యక్షుడు అయినవోలు పవన్ కుమార్, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కాపుల నాగరాజు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, అజీజ్, ఇర్ప సూరిబాబు, కల్లూరి శ్రీను, కవ్వాల రాము, అన్ని గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు మరియు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పంజా రాజు పాల్గొనడం జరిగింది
