UPDATES  

 పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

 

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్*:రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిగా తీసుకొని ఇల్లందు ఏఎంసీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీశ్రేణుల ఆధ్వర్యంలో మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… హరిసింగ్ నాయక్ పుట్టినరోజు నేపథ్యంలో రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని హరిసింగ్ నాయక్ జన్మదినం సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొక్కలు నాటడం జరిగింది అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే కాకుండా తను నాటిన మొక్కకు తానే వనమాలిగా మారి మొక్కలను పరిరక్షించాలి అన్నారు. గ్రీన్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పట్టణ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే పాషా, ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబు, ఇల్లందు మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోషము, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సత్తల హరికృష్ణ, ఇల్లందు మండల సభ్యులు ఘాజి, ఇల్లందు మండల ఇందిరానగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, ఇల్లందు యువజన నాయకులు యాకూబ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !