గ్రామస్తులు ఆర్ధిక అక్షరాస్యత సాధించాలి..
• ఏపిజివిబి మేనేజర్ ఏ.రవికుమార్..
మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 15: గ్రామస్తుల ఆర్ధిక అక్షరాస్యత సాధించాలని ఏపిజివిబి బ్యాంకు మేనేజర్ ఏ. రవికుమార్ అన్నారు. శనివారం పోకలగూడెం గ్రామంలో ఏపిజివిబి బ్యాంకు ఆద్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సమావేశంలో మేనేజర్ పాల్గొని, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు రోజువారి, నెలవారి పొదుపును ప్రారంభించాలని, పొదుపు ద్వారానే ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చన్నారు. ఖర్చుల తగ్గించుకోవడంతో పాటు, పొదుపు చేయటం అనే విధనాన్ని జీవితంలో అలవర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్సియల్ మేనేజర్ త్రినాధ్, ఏపీఎం సంతోష్, సిసి మల్సూర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.