UPDATES  

 ముస్లిం సోదరులకు రంజాన్ దుస్తుల పంపిణీ…. -మణుగూరు జడ్పిటీసీ పోశం నర్సింహారావు.

మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 15: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక
తహశీల్దార్ కార్యాలయంలో నిరుపేద ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందజేసే రంజాన్ తోఫా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మణుగూరు జడ్పిటీసీ పోశం నర్సింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని మతాల వారిని ఒకే విధంగా చూస్తూ అన్ని పండుగలకు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కటోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం మైనార్టీలందరికీ ఇఫ్తార్ విందుల్ని ఏర్పాటు చేస్తూ ముస్లింల పట్ల తన ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారన్నారు. షాదీ ముబారక్ లాంటి విశిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక సౌలభ్యాన్ని సమకూరుస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమం తహసీల్దార్ నాగరాజు, ఎంపీపీ కారం విజయ కుమారి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, మండల కోఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచులు ఏనిక ప్రసాద్, బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి , యాదగిరి గౌడ్, ప్రభుదాస్, ఆవుల నరసింహారావు, మేకల రవి, కోటేశ్వరరావు, రమణ, బాబ్ జానీ, రహీం, యూసఫ్ షరీఫ్, గుర్రం సృజన్, రంజిత్, శీను, రాంబాబు, నాగరాజు, మండల, టౌన్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !