మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ ..ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 14న ప్రారంభమైన సీపీఐ పార్టీ తలపెట్టిన ప్రజాపోరు యాత్ర ఏప్రిల్ 17న ఇల్లందుకు చేరుకుంటుందని సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు కె.సారయ్య తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక జీసీసీ గోడౌన్ లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రజాచైతన్యం రావాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ చేపట్టిన ప్రజపోరు యాత్ర సోమవారం ఇల్లందుకు చేరుకుంటున్నారు. అదేరోజు సాయంత్రం పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్లో జరిగే మహాసభకు ప్రజలు, కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి కా హటావో దేశ్ కా బచావో అనే నినాదంతో ప్రజలను చైతన్య పరచాలని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని వచ్చే నెల మే 14 వరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమంను కూడా చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కరపత్రాలను పంచుకుంటూ ప్రచార జాతాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవరకొండ శంకర్, బందం నాగయ్య, బైరవేని సదానందం, పొలు శ్రీకాంత్, గాంధీ, రామమూర్తి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.