వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్య కావించబడ్డ సంఘటన ఆదివారం కొత్తగూడెంలో సంచలనం రేపింది. వివరాలు ఎలా ఉన్నాయి*కొత్తగూడెం పట్టణం కూలీ లైన్ నివాసి అయిన హరి ప్రసాద్ కోరి వయస్సు 40 సం, లు, పరదేశి, l భద్రాచలం పేపర్ బోర్డు లిమిటెడ్ లో క్యాజువల్ లేబర్ పనిచేస్తున్నాడు, హరి ప్రసాద్ కోరి భార్యతో చంద్రశేఖర్ అలియాస్ చందు , ఇండియన్ గ్యాస్ డెలివరీ బాయ్ గా పని చేస్తు అక్రమ సంబంధం ఏర్పరచుకొని తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నదని, హరి ప్రసాద్ కోరి ఇద్దరు వ్యక్తులతో కలసి 20 రోజుల క్రితం చందు ఇంటికి వచ్చి చంద్రశేఖర్ గూర్చి తల్లీ, దండ్రులను అడగగా లేడని చెప్పగా ఇంట్లో సామాన్లు అన్ని పగలగిట్టి బెదిరించి వెళ్లినారు.మరల శనివారం రాత్రి హరిప్రసాద్ కోరి ఇద్దరు వ్యక్తులు టీఎస్ 28, 8729 స్క్రూటీ వాహనంపై వచ్చి చందు తల్లిదండ్రు లపై దాడి చేయగా పోశయ్య(72) మృతి చెందినాడు. లక్ష్మమ్మ(65) కు గాయాలు అయినాయి
ఇట్టి విషయం చందు తల్లి తన బంధువులకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు.కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపుచేపట్టినారు.
