మన్యం న్యూస్ వాజేడు
మండలంలో చింతూరు గ్రామంలో పూజారి సమ్మక్క అనారోగ్య కారణంగా మృతి చెందారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరరావు పార్ధవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించారు,నిరుపేద కుటుంబానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వ పథకాలు అన్ని అందేలా, చర్యలు తీసుకుంటామని అధైర్యా పడవద్దని, సభ్యులకు భరోసనిచ్చారు. సమ్మక్క దహన సంస్కారాల ఖర్చులకు 3500 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వీరితోపాటు గ్రామ వార్డు మెంబర్లు, దన్నూరి. హరీష్, ములకల అంజిబాబు, గ్రామస్తులు.. చిట్యాల. రాకేష,చల్ల రాము, సమ్మయ్య, రవీందర్ గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.