UPDATES  

 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికను నిర్వహించి పాఠశాలలో వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మండల పరిధిలోని సూది రెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మి మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నర్సాపురం 2004 -2005 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకొని కుటుంబాల పరిస్థితిలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు  ఈ పాఠశాలలు విద్యను అభ్యసించిన రోజులలో గత స్మృతులను నెమరు వేసుకున్నారూ. పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన రోజులు ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. ఈ పూర్వ విద్యార్థులు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా సతమతమవుతున్న అందరూ కలిసికట్టుగా వారికి ఆర్థిక సాయం అందిస్తామని అలానే పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం తమ గురువులైన సుదర్శన్ రాజేంద్రప్రసాద్ మురళి కృష్ణమాచార్యులు కోటా శ్రీనివాసరావు ఆచ్చుతానందరావు మైఖేల్ ప్రసాద్ కోటేశ్వరావు ఆనంద్ రెడ్డి వేణు పని శ్రీ పుష్ప శ్రీ లకు సాలువాలు కప్పి సన్మానించి మెమొటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మోత్కూరి శ్రీకాంత్, వినయ్, కొత్త చిరంజీవి, పి వంశి, గజ్జల రవి శెట్టి, ఈశ్వరరావు, రమాదేవి వరలక్ష్మి సరిత లావణ్య సునీత దుర్గాదేవి సత్యవేణి త్రివేణి రూప లత సుధారాణి ముత్యావళి వెంకటలక్ష్మి సరస్వతి బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !