UPDATES  

 భూ దందాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించాలి కోడెల నరేష్

మన్యం న్యూస్, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం ప్రభుత్వ ఉపాద్యాయుడు అయిన గొప్ప వీరయ్య భారత రాజ్యాంగం రచించిన డా.బి ఆర్ అంబేద్కర్ ను సైతం కించపరిచారు.భారతదేశ ప్రజలు అన్ని కుల,మత,ప్రాంత బేధాభి ప్రాయం లేకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వసుదైక కుటుంబం లా కలసి ఉంటున్నారు.అంత గొప్ప రాజ్యాంగ రచన చేసిన రచనాకర్త, స్ఫూర్తి ప్రధాత అయినటువంటి అంబేద్కర్ ని దూషించడం క్షమించరాని విషయం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు, ఉపయోగించుకొని ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని పొంది, పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి అంబేద్కర్ ని దూషించడం, కించపరచడం లాంటి మాటలు మాట్లాడినందుకు అతనిని కఠినంగా శిక్షించాలని జ్వాలా యూత్, ట్రస్ట్ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని కోడెల నరేష్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పక్కనపెట్టి భూ దందాలు చేస్తూ, అమాయకుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, గిరిజనులకు, గిరిజనేతరులకు చిచ్చు పెడుతూ, గిరిజనేతరులను బెదిరిస్తూ, ఇబ్బందులు పెడుతున్నాడు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి గొప్ప వీరయ్య ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఇతనిమీద తగు చర్యలు తీసుకోవాలని అధికారులను జ్వాలా యూత్ నుంచి కోరుతున్నాం,అంతే కాకుండా మా గిరిజనేతరులందరికి క్షమాపణ చెప్పాలని జ్వాలా యూత్ తరపున కోడెల నరేష్ డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !