UPDATES  

 పాలనపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

  • పాలనపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు
  • ఓటు వేసిన ప్రజలను గాలికి వదిలేశారు
  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ప్రజల కోసం పనిచేసే వారికే జనం పట్టం కడతారు
  • సమావేశంలో మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య చారి.

మన్యం న్యూస్, పినపాక:

సిపిఐ పార్టీ తలపెట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పాలనాపై చిత్త శుద్ధి లేదని, ఓటు వేసిన ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను చేస్తుందని, పేదవాని నడ్డి విరిచే విధంగా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య చారి మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, పదవులు శాశ్వతం కావని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే వారికే, పదవులు వరిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మనోహరాచారి, మండల కార్యదర్శి పద్మనాభ రాజు, పత్తిపాటి నాగేశ్వరరావు, మండల నాయకులు వెంకటాచారి, వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !