మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్, 16: దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామంలో ఉమ్మడి శ్రీనివాసరావు, మౌనిషా దంపతుల కూమార్తే సాయి దర్శిక అన్నప్రాసన వేడుక కార్యక్రమం కు హాజరు అయ్యి చిన్నారినీ నిండు మనసుతో ఆశీర్వదించిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం. ఆదేవిదంగా దమ్మపేట మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు స్వర్గీయ నాయుడు చెన్నారావు దశదిన కర్మలకు హాజరు అయ్యి చిత్రపటానికి నివాలి అర్పించిన తరువాత నాయుడు చెన్నారావు సంస్మరణ సభ లో సోయం వీరభద్రం మాట్లాడుతూ మంచి వ్యక్తి గా, మంచి స్నేహశీలి, వివాదరహితుడు, రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాల్లో తన దైన చేరగని ముద్ర వేసిన వ్యక్తి నాయుడు చెన్నారావు అని, అనాతి కాలంలో వారు చనిపోవడం భాధకారం అని, రాజకీయాల్లో వారు భౌతికంగా లేకపోవడము దురదృష్టకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టీడీపీ ఇంచార్జి కట్రo స్వామి ధోర, అశ్వారావుపేట టీడీపీ మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, శ్రీకాకుళపు సత్యవతి తధితరులు పాల్గొన్నారు.