UPDATES  

 తులసమ్మ తల్లి జాతర వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే పొందేం వీరయ్య..             

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండల పరిధిలోని లచ్చి గూడెం గ్రామంలో గత మూడు రోజుల క్రితం ప్రారంభమైన ఆదివాసి దేవత తులసమ్మ తల్లి జాతర వేడుకలలో భద్రాచలం శాసనసభ్యులు పొందెం వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు గిరిజన సాంప్రదాయాలతో డోలు డప్పు వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా జాతర నిర్వాహకులను స్థానికులను తులసమ్మ తల్లి జాతర ఆవశ్యకతను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం స్థానిక ప్రజలతో కొద్దిసేపు ఆయన ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన వెంట లచ్చిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఇర్ప చంటి  ఎస్టి సెల్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేష్ నాయకులు ఉబ్బ వేణు  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !