మన్యం న్యూస్, పినపాక:
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆప్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఆరె శంకరును నియమిస్తూ సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అరె శంకర్ మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు, పేద మధ్య తరగతి ప్రజలు తమ హక్కులను తెలుసుకునే విధంగా అవగాహన కలిగిస్తామని తెలిపారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడం, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపటం సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది అని తెలిపారు.