మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలం లోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన తిరునగిరి పుల్లయ్య , భార్య చనిపోయింది పిల్లలు లేరు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో జీవనం సాగిస్తున్న తరుణంలో వారం రోజుల క్రితం వచ్చిన గాలి దుమారం కారణంగా చెట్టు విరిగి ఇంటిపై పడి ఉన్న ఇల్లు కాస్తా పోయింది.ఇతనికి ఏదైనా సాయమందింఛమని గూబ సురేష్ మీకోసం మేమున్నాం సంస్థను సంప్రదించగా వెంటనే పలువురు దాతల సహకారంతో చర్ల లోని మేమున్నాం కార్యాలయంలో బాధితునికి 3,000 విలువ గల కిరాణా కూరగాయలు,బట్టలు 7,500 నగదును మొత్తంగా 10,500 ను సీనియర్ జర్నలిస్టు జవ్వాది మురళీకృష్ణ చేతుల మీదుగా వితరణ అందించడం జరిగింది. 76 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద కష్టం రావడం ఎంతో బాధాకరమని, ఇంకా ఎవరైనా రేకులు ,ఇటుకలు కూడా సమకూరిస్తే ఎంతో బాగుంటుందని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండవ రాయుడు, పటేల్ వెంకటేశ్వరరావు, శివరాజు కిషోర్, దొడ్డ ప్రభుదాస్, ఎర్రమిల్లి కిరణ్, మురళీధర్ నాయుడు, దొడ్డి సూరిబాబు, తాతారావు మాష్టారు, జవ్వాది సతీష్, గూబ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
