మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
చత్తీష్ ఘడ్ రాష్ట్రం కిష్టారం ప్రాంతం నుండి మిరప కాయ కోతలకు వలస కూలీలను తరలిస్తున్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న కూలీలలో ఒకరైన తునికి వాణి(19) మృతి చెందగా 25 మందికి గాయాలైన సంఘటన దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మిరప పండ్లు కోయడానికి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పలు గ్రామాల నుండి చర్ల మండలంలో పలు గ్రామాల రైతుల వద్దకు వలస కూలీలు కూలికి వెళ్తుంటారు ఈ క్రమంలో కిష్టారం సమీపంలో అమ్మపేట గ్రామానికి చెందిన సుమారు 65 మంది వలస కూలీలు వేకువ జామునే మిరప పండ్లు కోత కూలికి బొలెరోలో బయలుదేరారు ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న బొలోరో దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామానికి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో సుమారు 25 మందికి గాయాలవడంతో హుటాహుటిన భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స ఇప్పిస్తుండగా ఈ క్రమంలో చికిత్స పొందుతూ తునికి వాణి మరణించింది ఈ ప్రమాద ఘటనపై దుమ్ముగూడెం పోలీసులు కేసు నమోదు చేసి భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన వాణి మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబీకులకు మృతదేహం అప్పగించారు ప్రమాద ఘటనపై అందులో ప్రయాణిస్తున్న గాయపడిన కూలీలను వివరాలను అడిగి తెలుసుకుని విచారణ చేస్తున్నారు..