UPDATES  

 ప్రజలు నిన్ను నిషేధించే రోజులు వచ్చాయి గొప్ప వీరయ్య పై ఫైర్ అయిన మాజి ఆత్మ చైర్మన్ పగిడిపెల్లి

  • నియంతృత్వ పోకడలు మానుకో
  • ప్రజలు నిన్ను నిషేధించే రోజులు వచ్చాయి
  • గొప్ప వీరయ్య పై ఫైర్ అయిన మాజి ఆత్మ చైర్మన్ పగిడిపెల్లి
    మన్యం న్యూస్, మంగపేట.
    మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన మాజి ఆత్మ చైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గొప్ప వీరయ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, ఆరోపణలు ఎవరిదో ఇంటి స్థలాన్ని కబ్జా చేశాను అని ఆరోపించాడు, ఈ స్థలం దళితుడిని అయిన నాకు ప్రభుత్వం కేటాయించింది, అంతే కానీ నేను ఎవరి స్థలం ఆక్రమించలేదు ఇది అందరికి తెలిసిన విషయం. తాను ప్రజలు ఇచ్చిన ఎన్నో పదవులు నిర్వహించడం జరిగింది, ఎన్నో సంవత్సరాలనుండి అంబేద్కర్ భావజాలకుడిగా అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్తూ కుల మత రహితంగా ప్రజలను చైతన్య వంతం చేయటానికి కృషి చేస్తున్నాను. మండలం కేంద్రం లో భారత రాజ్యాంగం నిర్మాత,అందరికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనీ అంబేద్కర్ వాదులు అందరూ పూనుకుంటే సాక్షాత్తు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పై కూడ గొప్ప వీరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఈ విషయం పై అంబేద్కర్ వాదులందరు అతనికి ఇది సరికాదు అని చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకున్న గొప్ప వీరయ్య, మా నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాలపడుతున్నాడు, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిని ప్రశ్నించిన అంబేద్కర్ వాదులను 21 మందిని నిషేదించానని మాట్లాడుతున్నావ్ నువ్వు ఏమైనా రాజ్యాంగేతర శక్తివా, మాపియా డాన్వా,డిక్టేటర్ వా, అక్రమ వసూళ్లు, భూ దందాలు, సెటిల్మెంట్, చేస్తూ, ప్రజలను, అధికారులను బెదిరిస్తున్న నిన్ను ప్రజలు నిషేదించే రోజులు వచ్చాయి అని గొప్ప వీరయ్య పై మాజి ఆత్మ చైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు.తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వీరయ్య పై పోలీస్ వారు కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !