UPDATES  

 ఇది ఆరంభం మాత్రమే పొంగులేటి వెంటే మేమంతా జారే ఆదినారాయణ

పేటలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు మూకుమ్మడి రాజీనామాలు

ఇది ఆరంభం మాత్రమే పొంగులేటి వెంటే మేమంతా
జారే ఆదినారాయణ

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఎప్రిల్, 15: మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి 30 మంది వివిధ పదవులు ఉన్నవారు మరియు 70 మంది గ్రామ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి తమ సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు జూపల్లి రమేష్ తెలిపారు. శనివారం అశ్వారావుపేట పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ రాజీనామాల వివరాలను వెల్లడించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ మండలాల నుండి పొంగులేటి అభిమానులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అశ్వారావుపేట మండలం నుండి అనేక మంది నాయకులు, కార్యకర్తలు పొంగులేటి వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నామన్నారు. శ్రీనన్నకు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని శ్రీనన్న ముందుకు సాగుతున్నారన్నారు. వచ్చే నెలలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారన్నారు. పొంగులేటి వెంటే మేమంతా ఉన్నామని, పొంగులేటి లేని పార్టీ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు. రాజీనామాల పర్వం ప్రారంభమైందని, ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డ్ సభ్యులు స్వచ్చందంగా ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నారన్నారు. మరికొందరు పొంగులేటి శ్రీనన్నకు టచ్లోనే ఉన్నారని, వారంతా ఉప్పెనలా పొంగులేటి వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేవారు. ఎవరూ లేరని, తగిన సమయం ఆసన్నమైందని, గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట వైస్ సర్పంచ్ రేమల్ల కేదార్నాథ్ జూపల్లి ప్రమోద్ అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఆసుపాక సర్పంచ్ కుణుసోతు లింగయ్య, అచ్యుతాపురం సర్పంచ్, బచ్చువారిగూడెం సర్పంచ్, పసుపులేటి పణీంద్ర, అల్లాడి రామారావు, నండ్రు రమేష్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !