UPDATES  

 ఘనంగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ హరిసింగ్ నాయక్ జన్మదిన వేడుకలు*

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బానోత్ హరిసింగ్ నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బీఆర్ఎస్ పార్టీ పట్టణ,మండల కమిటీ, మహిళా, యూత్ విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్ లు మాట్లాడుతూ…ఇల్లందు నియోజకవర్గ ట్రబుల్ షూటర్ అయిన హరిసింగ్ నాయక్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించటం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులను మరిన్ని జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ గా ఉన్న ఆయన రాజకీయ రంగంలో మరిన్ని అత్యున్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ళ మాధవరావు, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, టీబిజీకెయస్ ఇల్లందు ఉపాధ్యక్షుడు రంగనాథ్, పదకొండవ వార్డ్ కౌన్సిలర్ చెరపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు పర్రె శ్రీనివాస్, యాకూబ్, ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబు, ఇల్లందు మండలం వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, ఇల్లందు మండల ఇంచార్జ్ యలమద్ది రవి, ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి, సనా రాజేష్, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు కోక్కు సరిత, గoడ్రాతి చంద్రావతి, జిల్లా నాయకులు మేకల శ్యామ్, యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సాతాల హరికృష్ణ, కాటా యూనియన్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !