మన్యం న్యూస్,ఇల్లందు*:రాహుల్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన పోవాలనే ఉద్దేశంతో మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర మంచిర్యాలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగిన మహాసభలో ఇల్లందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ జి.రవి పాల్గొన్నారు. అనంతరం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి ఇల్లందు నియోజకవర్గ స్థితిగతులపై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితో పాటు గార్ల మండల కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, బాణాల శ్రీనివాసరావు, ధారావత్ కృష్ణ, పసిక తిరుమల్, రవి, ఖాదర్ బాబు, వర్మ, కాశిo, పాషా, కమల, జ్యోతి, వందన, సత్యనారాయణ, సూరజ్, నరేష్, సురేష్, పాస్థం రవి, మహేష్, ప్రసన్నకుమార్, ప్రసాద్, సాయి, అర్జున్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, సతీష్, వినయ్, అఖిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
