మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సింగరేణి ఉపరితలి గని ప్రాంతమైన కొత్తగూడెంలో మరోసారి ఎండలు మెండుగానే ఉన్నాయి. గత మాదిరిగానే అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసుకోవడంలో రాష్ట్రస్థాయిలోనే చరిత్ర సృష్టించిన సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచి విపరీతమైన ఎండలు ఉండడంతోపాటు ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రతి వేసవికాలంలో ఏప్రిల్ మే నెలలో సూర్య ప్రతాపం కొత్తగూడాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగూడెంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసుకునే కేంద్రంగా మారింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎండ ప్రతాపం ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొత్తగూడెంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు అన్ని ఎండ తీవ్రతకు జనం సంచారం లేకపోవడంతో నిర్మాణంగా మారుతున్నాయి. పొట్ట తిప్పల కోసం చిరు వ్యాపారులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సాయంత్రం వేళల్లో ఎండ నుంచి ఉపశయనం కోసం చిన్నపిల్లలు , వృద్ధులు పార్కులకు పరిమితమై సేద తీరుతున్నారు. చల్లటి పానీయాల వైపుకు పరిగెడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్న కొత్తగూడెం ప్రాంతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ళలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మే నెలలో రికార్డ్ స్థాయికి మించి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసుకుంటుందని ప్రజలు ఇప్పటినుంచే భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థలు కొత్తగూడెంలోని ప్రధాన సెంటర్లో రద్దీగి ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగించే ప్రజల దాహర్తిని తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.