మన్యం న్యూస్, మంగపేట.
శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని బాధిత కుటుంబాలు,స్థానిక ప్రజలు ట్రస్ట్ సేవలను కొనియాడారు.మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముళ్లపూడి సత్యనారాయణ ,చేరుపల్లి గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూకట్ల అమృత,బంటు రమాదేవి ,కమలాపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎడమ భాను చంద్రారెడ్డి కుటుంబాలను శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ,ట్రస్ట్ సభ్యులుపరామర్శించి ,మనోధైర్యం కల్పించారు.బాధితులు కూకట్ల అమృత కు 3000/-,బంటు రమాదేవికి 2000/-రూ.లు, ముళ్లపూడి సత్యనారాయణకు వైద్య ఖర్చుల నిమ్మితం 4000/-నగదును ఆర్థిక సహాయంగా అందజేసి, మృతుడు ఎడమ భాను చందర్ రెడ్డి భార్య శివరాణికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదు కోవడంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని బాధిత కుటుంబాలు స్థానిక ప్రజలు ట్రస్ట్ సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లపుడు శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు, యువత పాల్గొన్నారు.
