UPDATES  

 సమిష్టి కృషితో లక్ష్యాలను సాధించాలి -సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్, ప్లానింగ్ డైరెక్టర్ జి వేంకటేశ్వర రెడ్డి

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 17

మణుగూరు సింగరేణి ఏరియా లో సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్, ప్లానింగ్ డైరెక్టర్ జి వేంకటేశ్వర రెడ్డి తమ అధికారిక పర్యటన లో భాగంగా సోమవారం మణుగూరు ఏరియా లో పర్యటిచారు.ఈ సంధర్బంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ తో కలసి పీకే ఓసీ-2,పీకే ఓసి-4,కేపియుజి, మణుగూరు ఉపరితల వ్యూ పాయింట్ నుండి క్వారి లో జరిగే బొగ్గు ఉత్పత్తిని,క్వారీ లో పని ప్రదేశాలకు వెళ్ళి యంత్రాల ద్వారా బొగ్గు లోడింగ్ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. అనంతరం గనుల అధికారు లతో జరిగిన ప్రత్యేక సమావేశం లో ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ,మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి మొత్తంలో మంచి గుర్తింపు పొందింది అన్నారు.ఆ వరవడిని కొనసాగిస్తూనే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని,ఏరియాలో సత్వరంగ నిర్దిష్టమైన ప్రణాళికలు వెంటనే రూపొందించుకోవాలి అని సూచించారు.ఈ సంవత్సర 2023-24 వార్షిక ఏరియా లక్ష్యమైన 119.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సమిష్టి కృషితో సాధించాలి అన్నారు.అందుకు గాను ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని మ్యాన్ పవర్ ను,యాంత్రిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకొవలని తెలిపారు.పని గంటలను 13.5 గంటల నుండి 18.00 గంటలకు పెంచడం ద్వారా లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని, ఉత్పత్తి ఐయిన బొగ్గును సకాలం లో డిస్పాచ్ అయ్యేల ఆయా గనుల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.అలాగే ఓబి నిర్దేశిత లక్ష్యాలను కూడ సాదించాలని డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్స్ జి.వేంకటేశ్వర రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్,కేపియూజి పీఓ జీ.నాగేశ్వర రావు, ఎంఎన్జీవోసి పిఓ శ్రీనివాస చారి,డి.ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి,ప్రాజెక్ట్ మేనేజర్ రాముడు, డిజిఎం కెసిహెచ్ పి.సురేష్, పికేఓసి-2 మేనేజర్ రాంబాబు, పికేఓసి-4 మేనేజర్ డి శ్రీనివాస రావు,మణుగూరు ఓసి మేనేజర్ బి.రాజేశ్వర్ రావు, సెక్యూరిటీ అధికారి షబ్బీర్బద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !