మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 17: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వి.వో.ఏ ల నిరవధిక సమ్మెలో బి.ఎస్.పి పార్టీ జిల్లా నాయకుడు మడకం ప్రసాద్ దొర పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క చిన్న పెద్ద ఉద్యోగిని కడుపున పెట్టుకుని చూసుకుంటామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఎంతో సేవ చేస్తున్న వి.వో.ఏ లను విస్మరించటం టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిలువుటద్దం లాంటిదని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఎన్నో రకాల పనులు చేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వివోఏ లను సెర్ఫ్ సంస్థలో ఉద్యోగులుగా గుర్తించి వారి వారి డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండలం బిఎస్పి పార్టీ చండ్రుగొండ అధ్యక్షుడు ఇనుముల పిచ్చయ్య,జున్ను రవి,కుక్కముడి చంటి మరియు వివోఏలు పాల్గొన్నారు.
