మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సోమవారం నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతాత్ వికాస్ పురస్కార్ ఇటీవల ములుగు జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన సందర్భంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ.3 కోట్ల నగదు పారితోషికం ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్,జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలసి అందుకున్నారు.ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకయ్య,డిఎల్పీఓ దేవరాజ్ లు తదితరులు పాల్గొన్నారు.