మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి వివోఏ లా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కార్యక్రమం చేపట్టారు. సిఐటియు మండల అధ్యక్షులు చిలకమ్మ ఐకెపి వివో ఏ మండల అధ్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు కి సంఘీభావంగా పూలదండ వేసి సమ్మె కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర అన్యాయం చేస్తుందని చాలీచాలని జీతంతో ఐకెపి వివో లు పనిచేయడం కష్టమని వారికి కనీస వేతనం రూ.26000 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం ఆరోగ్య బీమా తదితర ప్రభుత్వ సౌకర్యాలు కల్పించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు అనంతరం సిఐటియు ఉపాధ్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పేర్ ఉద్యోగులకు వేతనాలకు పెంచి వివోఎ ను గుర్తించకపోవడం బాధాకరమని రాష్ట్రంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వివో ఏలు శ్రమదోపిడికి గురవుతున్నారని వారికీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఉద్యోగ భద్రత గుర్తింపు కార్డు రూ.26వేల రూపాయల వేతనం కల్పించేంతవరకు ఈ నిరవేధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల వివోఏలు నాగరాజు కుమారి వెంకటేష్ అరుణ రాజేశ్వరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.