మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్ని వర్గాల ప్రజలకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించి వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 2వేల మంది పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిపోయాయి అని అన్నారు. తాను గతంలో శాసన సభ్యుడిగా ఉన్న హయాంలోనే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేశానని ప్రజల ఆశీర్వాద బలము ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తనపై ఉన్నాయని అన్నారు కొత్తగూడెంలో ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని గుర్తు చేశారు. రూ.70 కోట్లతో కొత్తగూడెంలోని ఉర్దూగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తాను కృషి చేశానన్నారు. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ , పాత కొత్తగూడెం ప్రాంతాలలో నున్న ముస్లిం సోదరులకు త్వరలోనే కబరిస్తాన్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ముస్లిం సోదరులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం సుమారు 50 మసీదులకు రూ.4.00 లక్షల రూపాయల నగదును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు,జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదవత్ శాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, ఏ ఎస్ జె జిల్లా అధ్యక్షుడు ఎం ఏ రజాక్, తహసిల్దార్లు శర్మ, వనమా కృష్ణ ప్రసాద్, నాగరాజు, కౌన్సిలర్ రుక్మేందర్ బండారి బిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, యూసుఫ్, మసూద్, టీబీజీకేస్ నాయకులు కాపు కృష్ణ, తిరుపతిరావు, కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, హమీద్, ఖయ్యూం, ఖలీల్, షరీఫ్ బాబా, మజీద్, రెహమాన్, సర్పంచ్ రతన్ నాయక్, మోతి, రాజేష్, కాళీ, పీరు, షరీఫ్, అజీజ్ ఖాన్, మధుసూదన్ రావు, తోగర రాజశేఖర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు