UPDATES  

 ముస్లింలకు దుస్తుల పంపిణీ చేసిన ఎంపీపీ

 

మన్యం న్యూస్, పినపాక:

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరీమణులకు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ సోమవారం దుస్తులను పంపిణీ చేశారు. ముస్లిం ఆడపిల్లలకు ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా నూతన దుస్తులను పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా పినపాక రైతు వేదికలో ముస్లిం సోదరీమణులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ఎంపీటీసీ కాయం శేఖర్, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, కో ఆప్షన్ సభ్యుడు జహంగీర్, ఆర్ ఐ  వీరభద్రం, బాలకృష్ణ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !