- కాలినడకన వచ్చిన రహదారి రూపురేఖలు మార్చుతున్న రేగా
- రహదారి పనులు పూర్తయితే ఎస్సీ కాలనీ వాసుల కష్టాలు తొలగినట్టే
- రూ 86 లక్షలతో రహదారి నిర్మాణం
- ]పినపాక ఎమ్మెల్యే రేగా కృషి చిరస్మరణీయం
- పల్లె జనం గుండెల్లో పదిలంగా…
మన్యం న్యూస్ గుండాల: తాను కాలినడకన వచ్చిన రహదారి రూపురేఖలను పూర్తిస్థాయిలో మారుస్తున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. గుండాల మండలం పరిధిలోని దామరతోగు ఎస్సీ కాలనీ కి వెళ్లాలంటే నరకయాతన పడాల్సిందే అలాంటి రహదారిని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూ. 86 లక్షల రూపాయలతో రహదారిని మంజూరు చేసి పనులను ప్రారంభించారు. ఇప్పటికి చాలావరకు పనులు పూర్తి అవ్వడంతో ఎస్సీ కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో గెలుపొందిన తర్వాత ఇదే రహదారి గుండా రేగా కాంతారావు కాలినడకన నడుచుకుంటూ గ్రామానికి చేరుకొని అక్కడినుంచి మళ్లీ కాలినడకమే ప్రధాన రహదారికి చేరుకున్నారు అప్పుడే ఆయన రహదారిని మంజూరు చేయించాలన్న కొంతమేర కరోనా ఇబ్బంది ఉన్న సమయంలో నిధులు మంజూరు కాకపోవడంతో గత సంవత్సరం పట్టుబట్టి నిధులను మంజూరు చేశారు. వెనువెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులను చకచక చేయిస్తున్నాడు. తాను హామీ ఇస్తే నెరవేర్చే విధంగా ఉంటాయి తప్ప హామీలకే పరిమితం కావు అనేది ఈ రహదారి నిర్మాణం నిరూపితమైందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
ఇంత తొందరగా పనులు అవుతాయని అనుకోలే
: ఇంత తొందరగా పనులు ప్రారంభమవుతాయని అనుకోలేదని ఎస్సీ కాలనీకి చెందిన రమాదేవి పేర్కొన్నారు. గతంలో ఎందరో నాయకులు మీకు రహదారి మంజూరు చేస్తామన్నారు తప్ప చేసింది మాత్రం రేగా కాంతారావు అని ఆమె అన్నారు
రహదారి పూర్తయితే కష్టాలు తొలగినట్టే:
రహదారి పనులు పూర్తయితే చిరకాల కష్టాలు తొలగినట్టేనని చెన్నూరి లక్ష్మయ్య పేర్కొన్నారు. త్వరగా పనులు పూర్తిచేసే విధంగా చొరవ చూపుతున్న రేగా కాంతారావు కు రుణపడి ఉంటామని ఆయన అన్నారు